This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భిణీ స్త్రీలలో అండం విడుదల అవుతుందా?

Ovulation
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Jan 3, 2026
గర్భిణీ స్త్రీలలో అండం విడుదల అవుతుందా?
Likes2 Likes|
Read time6 min

మాతృత్వాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలు గర్భం మరియు అండోత్సర్గము(ఓవులేషన్) గురించి తెలుసుకోవాలి. అండోత్సర్గము ఖచ్చితమైన సమయం ఒక స్త్రీ నుంచి మరొ స్త్రీకి భిన్నంగా ఉన్నప్పటికీ, వారు అండోత్సర్గము యొక్క సంకేతాలను గుర్తించగలరు. అలాగే గర్భవతి అయ్యే అవకాశాలను పెంచడానికి వారి లైంగిక కార్యకలాపాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.. ఒక మహిళ గర్భవతి కాకపోయినా మరియు గర్భధారణను ఇంకా ప్లాన్ చేస్తూ ఉండకపోయినా కూడా, వీటన్నింటి గురించి ఆమెకు సరిగ్గా తెలిసి ఉండాలి. గర్భధారణకు సంబంధించిన ఒక ప్రశ్న ఏమిటంటే - గర్భధారణ సమయంలో స్త్రీలలో అండోత్సర్గము(ఓవులేషన్) జరుగుతుందా?

గర్భిణీ స్త్రీలలో అండోత్సర్గము జరుగుతుందా అన్న అంశాన్ని పరిశోధించే ముందు - అండోత్సర్గము అంటే ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక స్త్రీ (ఆమె ప్రసవ లేదా పునరుత్పత్తి వయస్సులో) తన అండాశయం నుంచి పరిపక్వమైన గుడ్డును విడుదల చేసే ప్రక్రియ. ఆ గుడ్డు, స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందడం కోసం ఫెలోపియన్ ట్యూబ్‌లోకి వెళుతుంది. మొత్తం ఋతు చక్రంలో ఒకసారి మాత్రమే అండోత్సర్గము జరుగుతుంది. అండోత్సర్గము యొక్క సంకేతాలు క్రింది విధంగా ఉంటాయి:

  • గర్భాశయ శ్లేష్మంలో మార్పు
  • రొమ్ములలో సున్నితత్వం లేదా నొప్పి
  • వాసన గుర్తించే స్వభావంలో పెరుగుదల
  • దిగువ పొత్తికడుపు ప్రాంతంలో తేలికపాటి నొప్పి
  • లిబిడోలో మార్పులు
  • లైట్ స్పాటింగ్
  • గర్భాశయ మార్పులు
  • తలనొప్పి
  • వికారం
  • బేసల్ శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల

మహిళలు ఎప్పుడు గర్భవతిగా కావొచ్చు ?

అండోత్సర్గానికి 5 రోజుల ముందు గర్భవతి అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు అండోత్సర్గము జరిగే ముందు గర్భవతి కావొచ్చా?అన్న ప్రశ్నకు అవుననే సమాధానం ఇవ్వొచ్చు. స్త్రీ తన సరైన సమయంలో, అంటే అండోత్సర్గము రోజున లేదా అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు లైంగిక సంబంధం కలిగి ఉంటే మాత్రమే గర్భం సాధ్యమవుతుంది. కాకపోతే, మానవజాతిని ఆశ్చర్యపరిచేందుకు ప్రకృతికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి సూపర్‌ఫెటేషన్ - ఒక మహిళ ఇప్పటికే బిడ్డను మోస్తున్నప్పుడు మరొసారి గర్భం దాల్చడం మరియు రెండోది ఇంప్లాంటేషన్.

స్త్రీ శరీరంలో ఓవులేషన్ పీరియడ్ జరుగుతోంది అంటే ఆమె గర్భవతి కాదు అని అర్థమా? ఋతు చక్రానికి గర్భం అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి చాలామంది మహిళలు ఈ ప్రశ్నకి అవుననే సమాధానం ఇచ్చుకుంటారు. స్త్రీలు గర్భం దాల్చినప్పుడు, వారి ఋతు కాలాలు ఆగిపోతాయి లేదా బిడ్డను ప్రసవించే వరకు అండోత్సర్గము ఆగిపోతుంది. గర్భంలో అభివృద్ధి చెందుతున్న పిండం యొక్క అవసరాలకు అనుగుణంగా వారి శరీరాలు ఈ మార్పులకు లోనవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే, గర్భధారణ సమయంలో ఓవులేషన్ జరగదు.

అయితే, న్యూయార్క్ టైమ్స్‌‌ ఇటీవల ప్రచురించిన Q & A లో అత్యంత అసాధారణమైన పరిస్థితులలో మాత్రం.. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు సైతం అండోత్సర్గము జరిగే అవకాశం ఉందని నిర్ధారించింది. ఈ అసాధారణ విషయాన్ని సూపర్‌ఫెటేషన్ అంటారు. అంటే, తల్లి లోపల రెండు పిండాలు ఏకకాలంలో అభివృద్ధి చెందుతాయి. కానీ పిండాల అభివృద్ధి వివిధ దశలలో ఉండేందుకు చాలా ఎక్కువ అవకాశం ఉంది. అయితే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సూపర్‌ఫెటేషన్ అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, ఇలాంటి కేసులు ఇటీవల ఒకటి టెక్సాస్‌లో మరియు మరొకటి USAలోని కాలిఫోర్నియాలో బయటపడ్డాయి.

గర్భధారణ సమయంలో అండోత్సర్గము అనేది అరుదైన సంఘటన

కాబట్టి, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువగా అండోత్సర్గము చేస్తారా? మీరు ఇప్పటికీ గర్భవతిగా ఉన్నప్పుడు అండోత్సర్గము చేస్తున్న లక్షణాలను గమనిస్తున్నారా? సూపర్‌ఫెటేషన్ గురించి తెలుసుకున్న తర్వాత, చాలా మంది మహిళలు తమ మనసులో ఈ ప్రశ్నలను కలిగి ఉండవచ్చు. దీనిపై స్పష్టత కోసం ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.

అప్పటికే గర్భవతిగా ఉన్న సందర్భంలో మరోసారి గర్భవతిగా మారడం ఎలా సాధ్యమవుతుంది?

మానవులలో అసాధారణమైనప్పటికీ, కంగారూలు, గుర్రాలు, ఎలుకలు మరియు కుందేళ్లు వంటి ఇతర క్షీరదాలలో సూపర్‌ఫెటేషన్ సాధారణం. కొన్నిసార్లు, ఈ జంతువులు డబుల్ ప్రెగ్నన్సీ పొందటానికి రెండు గర్భాశయాలను కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, గర్భధారణ సమయంలోనూ వారి ఋతు చక్రం ఆగదు. అయితే, మానవులలో, స్త్రీలు గర్భం దాల్చిన వెంటనే, వారి ఋతు చక్రం ఆగిపోతుంది. అది వారిలో మరొక గర్భం రాకుండా చేస్తుంది. సాధారణంగా, ఒక మహిళ గర్భవతి అయిన తర్వాత, ఆమె శరీరం గుడ్లు విడుదల చేయడాన్ని నిలుపుదల చేస్తుంది. మరియు శారీరక మరియు హార్మోన్ల మార్పులతో సహా గర్భం యొక్క మొత్తం మెకానిజం రెండవ గర్భధారణను నివారించడానికి పనికి వస్తుంది.

కాకపోతే, సూపర్‌ఫెటేషన్‌లో, ఇప్పటికే గర్భవతి అయిన స్త్రీ అండోత్సర్గాన్ని కొనసాగించి గుడ్డును ఫలదీకరణం చేయడానికి మరియు ఇంప్లాంటేషన్‌కి సాధ్యమయ్యేలా మగ స్పెర్మ్‌కు పనిని సులభతరం చేస్తుంది. కాకపోతే ఇది అసాధారణమైన సంఘటన అని గుర్తు పెట్టుకోవాలి.

సూపర్‌ఫెటేషన్ ఎలా జరుగుతుంది?

2011 లో సైంటిఫిక్ అమెరికన్ ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ క్రింది తెలిపిన అసాధ్యమైన సంఘటనలు జరిగితే తప్ప ఇప్పటికే గర్భవతిగా స్త్రీకి మళ్ళీ గర్భం ధరించే అవకాశం దాదాపు లేదు. అందులో తెలిపిన అంశాలు ఏంటి? అనేది ఒకసారి చూద్దాం:

  • మహిళలలో గర్భధారణ కొనసాగుతున్న సమయంలో తప్పనిసరిగా అండోత్సర్గము జరగాలి. లేదా అండోత్సర్గము జరుగుతున్న సంకేతాలను కనిపించాలి.
  • పిండం ఇంప్లాంటేషన్‌ను సులభతరం చేయడానికి స్పెర్మ్ తప్పనిసరిగా సురక్షితమైన గర్భాశయం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్‌లకు ఇప్పటికే ఆక్రమించిన గర్భాశయం ద్వారా చేరుకోవాలి.

కవలలను కలిగి ఉండటం నుంచి సూపర్‌ఫెటేషన్ ఎలా భిన్నంగా ఉంటుంది?

సూపర్‌ఫెటేషన్ కవలలకు భిన్నంగా ఉంటుంది. స్త్రీలు తమ గర్భంలో కవలలను ఎప్పుడు కలిగి ఉంటారంటే -

  • ఒక ఫలదీకరణ గుడ్డు రెండుగా విభజించబడినప్పుడు, లేదా
  • రెండు స్పెర్మ్‌లు ఒకే సమయంలో రెండు గుడ్లను ఫలదీకరణం చేసినప్పుడు

అయితే, సూపర్‌ఫెటేషన్ స్త్రీలో అదనపు పిండాన్ని అభివృద్ధి చేస్తుంది. దాని వయస్సు ఇప్పటికే ఉన్న పిండం కంటే కొన్ని వారాలు తక్కువగా ఉంటుంది. 2008లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రచురించిన ఒక పేపర్ ప్రకారం, సూపర్‌ఫెటేషన్ జరిగిన సందర్భాలలో, రెండు పిండాలు వేర్వేరు అమ్నియోటిక్ సంచులలో అభివృద్ధి చెందుతాయి. అలాగే గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత వేర్వేరు పరిమాణాలను కలిగి ఉంటాయి.

సూపర్‌ఫెటేషన్ జరగడానికి కారణాలు మరియు దీని వల్ల ఉన్న రిస్క్ ఫాక్టర్స్ ఏంటి?

సూపర్‌ఫెటేషన్ కేసుల సంఖ్య చాలా అరుదు కాబట్టి, దాని వెనుక ఉన్న కారణాలు మరియు రిస్క్ ఫాక్టర్స్ ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, సంతానోత్పత్తి చికిత్సలు తీసుకున్న మహిళలు సూపర్‌ఫెటేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. సూపర్‌ఫెటేషన్ ఎంత అరుదుగా జరుగుతుంది అన్న దాంతో సంబంధం లేకుండా, చాలా మంది పిల్లలు ఆరోగ్యకరంగా జీవిస్తూ ఉంటారు. అయితే, వారు నెలలు నిండకుండానే జన్మించి ఉండవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్​ (IUI) వలన ప్రెగ్నెంట్ అయ్యే చాన్సెస్ ఏమిటి?

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.